Muta Gopal | ముషీరాబాద్, మార్చి 8 : మహిళలను అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అడిక్మెట్ డివిజన్ విద్యానగర్ శనివారం మహిళలకు చీరల పంపిణీ, సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మహిళలను సత్కరించి, చీరలు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలపై వివక్షత చూపవద్దని, అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించాలని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం ముందడుగు వేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు కే సురేందర్, అనురాధల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ, ముచ్చకుర్తి ప్రభాకర్, మాధవ్, సత్యనారాయణ, మామిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.