Maganti Gopinath | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. మాగంటి గోపీనాథ్‌ను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, పలువురు నాయకులు ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. మాగంటి గోపీనాథ్ గుండె సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.