MLA Madhavaram | మియాపూర్, ఫిబ్రవరి 15 : తెలంగాణ రాష్ట్ర ప్రదాత బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఈనెల 17న ఘనంగా నిర్వహించనున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాడవాడల విస్తృత కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. ఈనెల 17న కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని నిర్వహించనున్న వృక్షార్జన కార్యక్రమ పోస్టర్ను ఎమ్మెల్యే కృష్ణారావు కూకట్పల్లిలోని తన నివాసంలో శనివారం ఆవిష్కరించారు. మొక్కలు నాటి వాటిని సంపూర్ణంగా పరిరక్షించి కేసీఆర్కు కానుకగా అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు శ్యామల రాజు, హైదర్ నగర్ డివిజన్ సుబ్బరాజు, మియాపూర్ డివిజన్ గోపరాజు శ్రీనివాస్, రోజా, శేరిలింగంపల్లి డివిజన్ రవియాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.