Lasya Nanditha | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంతిమయాత్ర ప్రారంభమైంది. కార్ఖానాలోని ఆమె నివాసం నుంచి బీఆర్ఎస్ శ్రేణుల మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి లాస్య నందిత పాడె మోసి, నివాళులర్పించారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని స్మశానవాటికలో లాస్య నందిత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.