MLA Krishna Rao | మియాపూర్, ఫిబ్రవరి 15: గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ అని సమాజ శ్రేయస్సు కోసం ఆయన ఎంతో కృషి చేశారని శేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. అహింస శాంతి ప్రేమ మార్గాలను ఆయన చూపారని సంత్ బాట అందరికీ ఆదర్శనీయమన్నారు. సంతు సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు సంత్ సేవాలాల్ అని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మాజీ కార్పోరేటర్ రంగారావు, బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి సతీశ్ రావు, గొట్టిముక్కల పాండు రంగారావు, కలిదిండి రోజా, బిఎస్ఎన్ కిరణ యాదవ్, గోప్రా శ్రీనివాసరావు, వాలా హరీష్ రావు, బీఆర్ఎస్వీ యశ్వంత్ కుమార్ రాజు, అమలవలస రాజు, వడ్డే రాజ్, రామకృష్ణ గౌడ్, సతీష్, తిరుపతి, గోపాల్, శ్రీధర్, ముదిరాజ్, రెడ్డి నాయక్, కృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.