MLA KP Vivekanand | కుత్బుల్లాపూర్, మార్చి 2 : విద్యాలయాలు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిది దిద్దే పరిశ్రమలుగా మారాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సిలోయం గ్రామర్ స్కూల్లో విజ్ఞాన మేళా ఘనంగా జరుగుతుంది. రెండు రోజులపాటు నిర్వహిస్తున్న విజ్ఞాన మేళా శనివారం ప్రారంభమైంది. ఆదివారం ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సైన్స్ ఫెయిర్‌ను సందర్శించారు. విద్యార్థుల ప్రదర్శన తిలకించి, ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాలయాలు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిది దిద్దే పరిశ్రమలుగా మారాలని అన్నారు. చదువుతోపాటు సంస్కారం, నైతిక ప్రవర్తనను పెంపొందించాలని సూచించారు. విద్యార్థులకు నిజమైన పరిజ్ఞానాన్ని అందించి, శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నతులుగా తీర్చిదిద్దాలని అన్నారు. సైన్స్ ఫెయిర్‌లో విద్యార్థులు భౌతిక, జీవశాస్త్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులను తయారుచేసి, ప్రదర్శించారు. వాటితోపాటు గణితం, భాషకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లిటిల్ లిల్లీ విద్యాసంస్థల చైర్పర్సన్ మంజుల ప్రకాష్, పాఠశాల డైరెక్టర్ సాయి దీప్ బర్మా, డైరెక్టర్ బర్మా మౌనిక, టీచర్ వింధ్యారాణి, నాగ విజయ, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.