MLA Kaleru Venkatesh | కాచిగూడ, మే 14 : ప్రజల సహకారంతోనే నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. పెండింగ్ పనులను పరిష్కరించి, ప్రణాళిక బద్దంగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. చెప్పల్ బజార్‌లోని దశరథ్ గల్లీలో బుధవారం రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ ఉమా యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే కాలేరు ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు స్థానిక ప్రజలు పర్యవేక్షించినప్పుడే నాణ్యత ఉంటుందని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న లో ప్రెషర్ వాటర్ సమస్య పరిష్కారంతోపాటు బస్తీ, కాలనీల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం డ్రైనేజీ వ్యవస్థను ఆధునికరిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కన్నె రమేష్ యాదవ్, కాచిగూడ డివిజన్ ఇంచార్జి డాక్టర్ శిరీష ఓంప్రకాష్ యాదవ్, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎర్ర భీష్మాదేవ్, నాగేందర్ బాబ్జి, బి.కృష్ణ గౌడ్, బబ్లు సింగ్, ఎల్.రమేష్, మహేష్ కుమార్, సుభాష్ పటేల్, బబ్బి, శ్రీకాంత్ యాదవ్, వాసు, రవి యాదవ్, అరవింద్, నర్సింగ్ రావు, భీమ్రాజ్, రవి యాదవ్, రఘుతో పాటు స్థానికులు పాల్గొన్నారు.