Amberpet | అంబర్‌పేట, ఫిబ్రవరి 13 : అంబర్‌పేట నియోజకవర్గంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. బాగ్అంబర్ పేట డివిజన్లోని ఏఎం-పీఎం పాన్ షాపు గల్లీలో రూ.22 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను డివిజన్ కార్పోరేటర్ బి.పద్మావెంకటరెడ్డితో కలిసి గురువారం ఎమ్మెల్మే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత కొన్ని నెలల క్రితం ఈ ప్రాంతంలో డ్రైనేజీ పైప్‌లైన్ పనులు చేపట్టడం జరిగిందన్నారు. పనులు పూర్తయిన తర్వాత రోడ్డు మొత్తం గుంతలుగా మారిందని చెప్పారు. రాకపోకలకు ఇబ్బందిగా ఉండడంతో నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణం చేస్తున్నామని పేర్కోన్నారు. అలాగే డివిజన్లోని అన్ని ప్రాంతాలలో కూడా రోడ్లు, మంచినీటి పైప్లైన్లు, డ్రైనేజీ పైప్లైన్లు, వాన నీటి పైప్లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాములు ముదిరాజ్, టి.రమేష్, మర్యాల రవీందర్, జె.బాలరాజు, శ్రీహరి, మిర్యాల శ్రీనివాస్, ఎన్.వెంకటరమణరాజు, శ్రీనివాస్‌యాదవ్, సునీల్, బంగారు శ్రీను, నరహరి, లక్ష్మణ్, డీఈ ప్రశాంతి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.