MLA Kaleru Venkatesh | గోల్నాక, జూన్ 13 : నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థానికులను వేధిస్తున్న డ్రైనేజీ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి కొత్త పైపులైన్ల వ్యవస్థ ఏర్పాటు పనులను వేగవంతం చేశామని ఆయన తెలిపారు. శుక్రవారం అంబర్పేట డివిజన్ ప్రేమ్ నగర్లో రూ.4 లక్షల అంచనా వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేస్తున్న డ్రైనేజీ పైపులైన్ పనులను స్థానిక కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో భవిష్యత్లో ఎలాంటి మురుగు సమస్య తలెత్తకుండా ప్రణాళికా బద్ధంగా పనులు చేపడుతున్నామని అన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో మౌలిక వసతుల్లో భాగంగా మంచినీటి, డ్రైనేజీ పైపులైన్ల ప్రక్షాళన, రహదారుల అభివృద్ధి, పార్కుల సుందరీకరణ. కమ్యూనిటీ హాళ్ల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలో వసుతుల పనులు చేపట్టామని తెలిపారు.
కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్ మాట్లాడుతూ.. డివిజన్లో మౌలిక వసుతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అనంతరం బస్తీల్లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశిచారు. ఈకార్యక్రమంలో జలమండలి డీజీఎం విష్ణువర్ధన్ రెడ్డి, ఏఈలు ప్రదీప్ కుమార్, మజీద్,వర్క్ ఇన్స్పెక్టర్ లు రమేష్, దుర్గ, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్దార్థ ముదిరాజ్, పార్టీ నాయకులు, స్థానిక బస్తీ ప్రజలు పాల్గొన్నారు.