మల్కాజిగిరి, నవంబర్ 1: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమని మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరి, అల్వాల్, గౌతంనగర్, నేరేడ్మెట్, వెంకటాపురం, మౌలాలి డివిజన్లలోని బస్తీలు, కాలనీల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. అలాగే.. పలు కాలనీల్లో ఏర్పాటు చేసిన సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజల సమస్యలు పట్టించుకోరని, అందుకే వారిని నమ్మడం లేదని అన్నారు. కొన్ని నెలల కిందట కర్నాటక రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, అందుకే కర్నాటక బార్డర్ నుంచి నారాయణఖేడ్‌కు వచ్చి రైతులు నిరసన తెలపడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షే మ పథకాలు అమలుపరుస్తున్నారని అన్నారు.
ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేశారని, దీంతో ఇబ్బందులు పడుతున్నారని, ఇక ఇబ్బందులు పడకుండా తాను ఎమ్మెల్యేగా గెలువగానే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపనులతోపాటు ప్రజలకు సంక్షేమ పథ కాలు అమలుపరుస్తుండటంతో బీజేపీ నుంచి నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని, మరికొందరు చేరడానికి సిద్ధంగా ఉన్నారని, వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సునీతారాము యాదవ్, మీనాఉ పేందర్ రెడ్డి, సబితాకిశోర్, మాజీ కార్పొరేటర్లు జగదీశ్‌గౌడ్, ఆకుల నర్సింగరావు, సర్కిల్ అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, జేఏసీ వెంకన్న, ఉపేందర్‌రెడ్డి, రాముయాదవ్, అనిల్‌కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, అమీనుద్దీన్, ఖలీల్, కృష్ణ, గౌలికర్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.