మాదాపూర్, అక్టోబర్ 31: హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీకి మద్దతుగా కాలనీ వాసులు మంగళవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వాహించారు. ఈ సందర్భంగా హుడా కాలనీ వాసులు మాట్లాడుతూ … రానున్న ఎన్నికల్లో మా పూర్తి మద్దతు బీఆర్ఎస్ అభ్యర్థి గాంధీకేనని అన్నారు.
శేరిలింగంపల్లిని అన్ని విధాల తీర్చిదిద్దిన ఘనత గాంధీకే దక్కుతుందన్నారు. నియోజకవర్గంలో ప్రజలు సుఖవంతమైన ప్రయాణాన్ని చేసేందుకు బస్తీలో, కాలనీలో మెరుగైన సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రజల సంక్షేమానికి నిరతంరం కృషి చేస్తు, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న నాయకుడు గాంధీ అని అన్నారు. ఇప్పటి వరకు రూ. 9 వేల కోట్లతో శేరిలింగంపల్లిలో పలు అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరిగిందని, ప్రజల కొరకు శ్రమించే నాయకుడు గాంధీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని కాలనీ వాసులు తీర్మానం చేశారు.
భారీ మెజార్టీతో శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా అందిస్తామని ముక్తకంఠంతో నినాదించారు. రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని, ముచ్చటగా మూడోసారి తిరుగులేని మెజార్టీని అందిస్తామని హుడా కాలనీలో వాసులు పేర్కొన్నారు. దీనికి స్పందించిన బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ ప్రజలు అభివృద్ధికే పట్టంగడుతారని, తిరుగులేని మెజార్టీతో ప్రజల ముందుకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలు నాపై చూపిన అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లిని రూ. 9 వేల కోట్ల వ్యయంతో అన్ని విధాల అబివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. మూడోసారి గెలిపించినట్లయితే శేరిరలింగంపల్లిని రెట్టింపు అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాలు, పార్టీ మహిళ సోదరీమణులు తదితరులు ఉన్నారు.