వెంగళరావునగర్, అక్టోబర్ 13: పెండ్లికి తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు సోహెల్ ప్రశ్నించారు. సోమవారం ఎస్పీఆర్హిల్స్లో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృతస్తాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ద్రోహమంతా బీఆర్ఎస్ పంపిణీ చేసే కాంగ్రెస్ బాకీ కార్డుల్లో ఉందని పేర్కొన్నారు.
ముస్లిం కబరస్తాన్‌కు స్థలం కేటాయింపులో సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రహ్మత్‌నగర్ మాజీ కార్పొరేటర్ ఎంఏ షఫీ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ అంతా జీరో అయిందని, షాదీ ముబారక్ సాయం లబ్ధిదారులకు అందడం లేదని విమర్శించారు. పరేషాన్ పోవాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని ఆయన కోరారు.
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌కు తెలంగాణ రాష్ట్రమంతటా వ్యతిరేకతే ఉందని బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డి అన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌లో కార్యకర్తలు బీఆర్ఎస్ విజయం కోసం సమష్టిగా పనిచేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్దితో పాటు..తెలంగాణ వ్యాప్తంగా చేసిన డెవలప్మెంట్ను కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు.