సంక్షేమ సర్కారు..
మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని బీఆర్ఎస్ మల్కాజిగిరి ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం అల్వాల్ డివిజన్ రాజీవ్ వీకర్‌సెక్షన్ కాలనీ, వెంకటాపురం డివిజన్ ఇందిరానగర్ బస్తీ, వినాయక్‌నగర్ బస్తీ, నేరేడ్మెట్ డివిజన్లలో పాదయాత్ర నిర్వహించారు.
మల్కాజిగిరి, అక్టోబర్ 12 : మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని బీఆర్ఎస్ మల్కాజిగిరి ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం అల్వాల్ డివిజన్ రాజీవ్ వీకర్‌సెక్షన్ కాలనీ, వెంకటాపురం డివిజన్ ఇందిరానగర్ బస్తీ, వినాయక్‌నగర్ బస్తీ, నేరేడ్మెట్ డివిజన్లలో పాదయాత్ర నిర్వహించారు. బాలసరస్వతినగర్లో మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
యువతీ యువకులు స్వయం ఉపాధి పొందడానికి ప్రభుత్వం ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలనెల పించన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇంట్లో ఆడ బిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి- షాదీముబారక్ పథకం ద్వారా రూ.1,00,116 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. దళిత బంధు ద్వారా నియోజకవర్గానికి 100 మందికి ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేశారని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సబితాకిశోర్, శాంతిశ్రీనివాస్ రెడ్డి, మీనాఉపేందర్‌రెడ్డి, అనిల్ కిశోర్, ఉపేందర్‌రెడ్డి, నేమూరి శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

