మియాపూర్: ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ వివేకానంద నగర్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ఆర్పీ కాలనీలో ఆదివారం నిరసన తెలిపారు. తొలుత అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి రోడ్డుపై బైఠాయించారు.
ఈ సందర్భంగా మాజీ కార్పొరేట్ రంగారావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తిన జగదీశ్ రెడ్డి ని కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయడం దారుణమన్నారు. అనంతరం రవీంద్రభారతిలో మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై అలాగే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి బొమ్మలను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేయడాన్ని నిరసిస్తూ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో గొట్టిముక్కల పెద్ద భాస్కర్ ,మాచర్ల భద్రయ్య,ఆంజనేయులు,బాబు తదితరులు పాల్గొన్నారు.