ఓట్ల తొలగింపుపై ఆగ్రహం.. ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్న బీజేపీ
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ధ్వజం.. ఎల్బీనగర్ చౌరస్తాలో ధర్నా.. ప్రతిపక్షాల గొంతును నొక్కుతున్న బీజేపీ సర్కార్.. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ధ్వజం.. ఎల్బీనగర్ చౌరస్తాలో ధర్నా
మన్సూరాబాద్, అక్టోబర్ 10: ఆనాడు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తే.. నేడు బీజేపీ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను సృష్టించి.. ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ ఓటర్ల జాబితా నుంచి అర్హులైన వేలాది మంది ఓటర్ల పేర్లను అనైతికంగా తొలగిస్తోందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు సంరక్షణ లక్ష్యంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీ, ఓటర్ల జాబితాలో అక్రమాలపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు మద్దతుగా ఎల్బీనగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేకసమగ్ర ఓటర్ల జాబి తా సవరణ (ఎస్ఐఆర్) పేరుతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఓట్ల ను తొలగిస్తున్నారన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత, నిష్పక్షపాత వైఖరి, జవాబుదారీతనం పా టించాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో ఓటింగ్ ప్రక్రియపై దేశ ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఓటు హక్కును కాపాడుకునేందుకు దేశ రాజధానిలో నిరసనలు తెలిపే హక్కులను కాలరాస్తూ నిర్భం ద వాతావరణం నెలకొల్పడం సరైంది కాదన్నారు.
57 మెట్రో స్టేషన్లను మూసి వేశారని, చివరికి సర్వోన్నత న్యాయస్థానం కలుగజేసుకున్న తర్వాత కూడా 40 స్టేషన్లలో రాకపోకలకు అంతరాయడం కలిగించడం దురదృష్టకరమన్నారు. తమ హక్కులను కాపాడుకునేందుకు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళుతున్న విద్యార్థులను భోపాల్‌లో నిర్భందించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నా రు. ప్రజా స్వామ్యంలో నిరసన తెలిపే హ క్కు ప్రతిఒక్కరికి ఉంటుందని.. అరెస్టు చేసి న విద్యార్థులను వారి రాష్ర్టాలకు క్షేమంగా పంపాలని డిమాండ్ చేశారు. 1975లో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచిపోయిందని, ఓటు హక్కును కాపాడుకునేందుకు నేడు ప్రజలు, యువత చేస్తున్న ఆందోళనలను అడ్డుకుంటే మరో అప్రకటిత ఎమర్జెన్సీగా నిలిచిపోతుందన్నా రు.
ఓటింగ్ ప్రక్రియపై దేశ ప్రజల్లో అనుమానాలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిన అవసరంఎంతైనా ఉందన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం సమగ్ర వివరణ ఇవ్వాలన్నారు. ఓట్ల అవకతవకలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, సాగర్ రెడ్డి, రమావత్ పద్మానాయక్, భవానీ ప్రవీణ్‌కుమార్, నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వర్లు, జక్కిడి మల్లారెడ్డి, చింతల రవికుమార్, తూర్పాటి చిరంజీవి, ముడుపు రాజిరెడ్డి, సత్యం చారి, జక్కిడి రఘువీర్ రెడ్డి, రుద్ర యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- BJP
- BRS leaders
- Congress
- Voters
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

