జూబ్లీహిల్స్, జూన్ 27: పేదల పక్షపాతిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం యూసుఫ్ గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో మాగంటి గోపీనాథ్ సంతాప సభ నిర్వహించారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గోపీనాథ్, కుమారుడు వాత్సల్యనాథ్, కుమార్తెలు అక్షర నాగ, దిషిర పాల్గొన్నారు.
మాగంటి గోపీనాథ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మాగంటి గోపీనాథ్ ప్రతి అడుగు పేదల కోసం వేశారని.. పేద ప్రజలే తన కుటుంబంగా భావించారని చెప్పారు. రహ్మత్‌నగర్ డివిజన్లో పేద ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు మాగంటి గోపీనాథ్ పరితపించారన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడి రిజర్వాయర్‌కు మాగంటి పేరు పెడతామన్నారు. ఈ సభలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, నేతలు రావుల శ్రీధర్‌రెడ్డి, సోహైల్, కార్పొరేటర్లు దేదీప్యరావు, వెల్దండ వెంకటేశ్ పాల్గొన్నారు.