బండ్లగూడ, ఆగస్టు 3 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంచార్జీ కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిదిలోని గంధంగూడలో పలు కాలనీల నివాసాల మధ్య మురుగునీరు శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల స్థానిక ప్రజలు ఇటివల మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంచార్జీ కార్తీక్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. అంతే కాకుండా ఆదివారం గంధంగూడలో నిర్వహించిన ధర్నాకు హాజరు కావాలని కోరారు. దీంతో గంధంగూలో వివిధ కాలనీ వాసులు నిర్వహించిన ధర్నాలో కార్తీక్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన స్థానిక ప్రజలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మురుగునీటి శుధ్ది కేంద్రాన్ని ఇక్కడి నుంచి తరలించే వరకు ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. ఎస్టీపీని ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా దుర్గంధం వెదజల్లుతుందని తెలిపారు. తద్వారా ప్రజలు అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెంటనే ఎస్టీపీ నిర్మాణంను మరో చోటికి తరలించాలని ఆయన అధికారులను కోరారు. లేదంటే ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు చేయక తప్పదన్నారు. అసాధ్యం అయిన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు హమీలను నేరవేర్చడంలో విఫలం అయ్యారన్నారు. స్థానిక శాసన సభ్యులు ప్రజల ఇబ్బందులను గాలికి వదిలేశాన్నారు. త్వరలో రాజేంద్రనగర్‌లో ఉప ఎన్నికలు వస్తాయని అప్పడు బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజలకు తాము ఎల్లపుడు అండగా ఉంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రావుల కోళ్ల నాగరాజు, రాముడు యాదవ్, రవీందర్ రెడ్డి, వెంకటేష్, గంగని రవికుమార్, సుధాకర్‌గౌడ్, ఉదయ్‌గౌడ్, శాంతినాయక్, శాంతికుమార్, చంద్రశేఖర్, పాండు, పెంటయ్యయాదవ్, ఇస్మాయిల్ ఇంతియాజ్, సయ్యద్ హాజి, శాముల్, రాజ్‌కుమార్, నరసింహ, కీర్తికాంత్, జ్యోతి, మాధవి, యుగంధర్, జావేద్, రాజు, మాలిక్ తదితరలు పాల్గొన్నారు.