ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్నది. ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డితోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరుతున్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో జోరుగా బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం..
రామంతాపూర్, నవంబర్ 26 : ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్నది. ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డితోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరుతున్నారు. ఇందులో భాగం గా ఆదివారం నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు. ఈ క్రమం లో అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డికి పలు సంఘాలు మద్దతు తెలిపాయి. నాచారం గీతా పారిశ్రామిక సంఘం, తదితర కుల సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. మేడల మల్లికార్జున్‌గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బండారిని ఘనంగా సన్మానించారు. బండారికి మద్దతు తెలుపుతున్నట్లు గీతా కార్మిక సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. బండారి మాట్లాడుతూ.. గౌడల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం గౌడులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని… కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
మాదగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో.
చిలుకానగర్‌లో మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి ఎంతో కృషి చేసిందని, కారుగుర్తుకు ఓటు వేయాలన్నారు. ఈ సందర్భంగా మాదిగ సంక్షేమ సంఘం బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు బన్నాల ప్రవీణ్, పల్లె నర్సింగ్‌రావు, మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షులు పార్నంది నర్సింగ్ రావు, రాంచందర్, అశోక్, వీబీ నర్సింహ, బలరాం, నర్సింహ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు..
ఆడబిడ్డ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. రామంతాపూర్ పుకట్ నగర్‌కు చెందిన 150 మహిళలు రాగిడి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పా ర్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు డాక్టర్ బీవీ చారి, సోమిరెడ్డి, కాలేరు నవీన్, మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, కైసర్, కదీర్, అబ్బు, యూసుప్, శంకర్, మోసిన్, షానూర్, ఫరూక్, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇంద్రానగర్‌లో అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేశారు.