కందుకూరు, ఆగస్టు 4: పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, భవిష్యత్ బీఆర్ఎస్దేనని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తిక్‌రెడ్డి, కందుకూరు మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్‌ను ఎర్రవల్లిలోని ఆయన స్వగృహంలో ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపాలన్నారు.
కేసీఆర్‌ను కలిసిన వారిలో మండల పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, మార్కెట్ మాజీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్‌రెడ్డి, మేఘనాథ్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహా రెడ్డి, మాజీ డైరెక్టర్లు పొట్టి ఆనంద్ తదితరులు ఉన్నారు.