బడంగ్‌పేట, మార్చి 12 : మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్‌పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మరోసారి మేయర్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. ఈ సందర్భంగా మేయర్ దుర్గా, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అవిశ్వాసం వీగిపోవడానికి పూర్తి స్థాయిలో సహకరించిన ఎమ్మెల్యేకు, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో కార్పొరేటర్లు సిద్దాల పద్మ అంజయ్య, ఏనుగుల అనిల్ కుమార్, ధనలక్ష్మి రాజ్‌కుమార్, బొక్క రాజేందర్ రెడ్డి, సిద్దాల లావణ్య బీరప్ప, రేఖాలక్ష్మణ్, మీర్‌పేట పార్టీ అధ్యక్షులు అర్కల కామేశ్ రెడ్డి, జఠావత్ శ్రీనునాయక్, ప్రభాకర్ రెడ్డి, గోపీయాదవ్, తదితరులు ఉన్నారు.