ఎల్బీనగర్, అక్టోబర్ 11: బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధికి బాటలు వేస్తున్నదని ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. కర్మన్‌ఘాట్ శ్రీలక్ష్మీ కన్వెన్షన్‌లో తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఓరుగంటి వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కుల సంఘాల ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు బీసీ బంధు, ఆత్మగౌరవ భవనాలు, వృతిదారులకు పనిముట్లు, విద్యార్థుల కోసం విదేశీ విద్య తదితర కార్యక్రమాలు సీఎం కేసీఆర్ న్యాయకత్వంలో అమలవుతున్నాయన్నారు.ఎల్బీనగర్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించి సిగ్నల్ రహితంగా మార్చామని, జీవో 118 తీసుకొచ్చి యూఎల్సీ సమస్యలను పరిష్కరించామని, ఆస్తిపన్నులు తగ్గించామని తెలిపారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తొలగించి దాని స్థానంలో వెయ్యి పడకల ఆసుపత్రిని ఇరవై ఐదు అంతస్తులతో రూ. 1200 కోట్లతో నిర్మిస్తున్నట్లు చెప్పారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన తెలంగాణ బీసీ సంఘాల జేఏపీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఓరుగంటి వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపినప్పటికీ కేంద్రం చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఎల్బీనగర్ నియోకవర్గం సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్న దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ, ముదిరాజ్ సంఘం నాయకుడు కావలి నర్సింహ ముదిరాజ్, ఎంబీసీ సంఘం అధ్యక్షుడు దూగుంట్ల నరేశ్, ఢిల్లీ గోపాల్, యాదవ సంఘం నాయకుడు నారగోని శ్రీనివాస్ యాదవ్, సగర సంఘం అధ్యక్షుడు అమరేందర్సాగర్, పెరిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బొలిశెట్టి సతీశ్‌కుమార్, కురుమ సంఘం నాయకులు నర్రె శ్రీనివాస్ కురుమ, గంగిరెద్దుల సంఘం అధ్యక్షుడు నర్సింహ, రజక సంఘం నాయకుడు ఎల్లన్న పాల్గొన్నారు.