గోల్నాక, డిసెంబర్ 11: క్రైస్తవుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఆదివారం అంబర్‌పేట డివిజన్ ప్రేమ్‌నగర్ సీపీఎల్ బేతాని చర్చి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్తో కలసి ఆయన పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. అదే విధంగా గోల్నాక అన్నపూర్ణనగర్ బేతాల్ గాస్పెల్ చర్చి వద్ద క్రిస్మస్ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్‌గౌడ్ తో కలసి ఎమ్మెల్యే హాజరై క్రిస్మస్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా క్రైస్తువులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. క్రిస్మస్ సందర్భంగా దుస్తులు, క్రిస్మస్ విందుకు డివిజన్‌కు రూ.లక్ష అందజేయడంతో పాటు క్రిస్టియన్ల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. క్రిస్మస్కు రెండు రోజులు సెలవులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే తెలిపారు. క్రిస్మస్ను ఆనందంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షిస్తూ వారికి పండగ శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్లు రాజు, జేడీజేఎస్, పాల్, రంగస్వామి, టి.దాస్, టీ శ్రీనివాస్, అన్నపూర్ణనగర్ బేతల్ చర్చి ప్రతినిధులు జి.వరకుమార్, సుధాకర్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులు మల్లేశ్‌యాదవ్, రామారావుయాదవ్, శ్రీనివాస్‌గుప్త, వంజరి నాగరాజు, సద్ధాం, సంతోష్‌చారి, వినయ్ పాల్గొన్నారు.
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
పేద, మధ్యతరగతి ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. గాంధీనైట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుర్మబస్తీలో ఆదివారం మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 450 మందికి బీపీ, మధుమేహం, జనరల్, కార్డియోలజీ తదితర పరీక్షలు అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో అందించారు. అనంతరం మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు ఉచిత వైద్య శిబిరాల్లో పాల్గొని వ్యాధులను నయం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాగ్‌అంబర్‌పేట కార్పొరేటర్ పద్మావతి, డాక్టర్లు కల్చేటి శ్రీధర్, రావుల సుధాకర్, శంభుల శ్రీకాంత్‌గౌడ్, గడ్డం శ్రీధర్, మెట్టే ధన్‌రాజ్, అచ్చిని రమేశ్, చంద్రకాంత్, వెంకటేశ్, లక్ష్మణ్, సాయిరాం, సాయితో పాటు గాంధీనైట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.