చార్మినార్, మే 2: హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా మోడ్ వద్ద ఉన్న బీఆర్ఎస్ (BRS) జెండా దిమ్మెను దుండగులు కూల్చివేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గులాబీ జెండాను తొలగించిన గుర్తుతెలియని వ్యక్తులు దిమ్మెను కూల్చివేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జెండా కూల్చి వేశారని మొఘల్ పుర డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు పుప్పాల రాధ కృష్ణ అన్నారు. ఈ మేరకు మొఘల్పుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
2009 పార్టీ జెండా దిమ్మెను అక్కడ ఏర్పాటుచేశామని, కక్ష సాధింపుగానే గుర్తు తెలియని వ్యక్తులు పరోక్ష దాడి చేశారాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్వహించిన బీఅర్ఎస్ 25 వసంతాల రజతోత్సవాల సందర్భంగా ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహించామన్నారు. దీనిని జీర్ణించుకోలేని కొందరు పార్టీ జెండాను తొలగించి తమ అక్కసును వెళ్లగక్కారని మండిపడ్డారు. దిమ్మెను తొలగించిన వారిని గుర్తించి తగిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.