సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ ) : గుర్తుల గుర్తుంచుకో.. కారును గుర్తుంచుకో.. అంటూ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల జైత్రయాత్ర జోరుగా సాగుతున్నది. నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇంటింటి ప్రచారం.. పాదయాత్రలు చేపడుతూనే.., మరోవైపు ఆత్మీయ సమావేశాలతో అన్ని వర్గాల మద్దతును కూడగడుతున్నారు.
కలిసివచ్చే నేతలను పార్టీలోకి ఆహ్వాని స్తూ.. అన్ని వర్గాలను ఒక్క తాటిపైకి చేరుస్తూ.. క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో ప్ర చార అస్త్రంగా గులాబీ సైనికులు ప్రతి ఓటరును కలుస్తూ.. అభ్యర్థుల గెలుపునకు బాటలు సుగమం చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. దాదా పు రెండు నెలల గులాబీ శ్రేణుల ప్రచార శైలితో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.