హైదరాబాద్: జూబ్లీహిల్స్లో (Jubilee Hills) కాంగ్రెస్ (Congress) నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద హల్చల్ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. స్థానికేతరులైనప్పటికీ నియోజకవర్గంలోనే ఉంది ఓటర్లను మభ్యపెడుతున్నారు. సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే మట్టా రాగమయి భర్త మట్టా దయానంద్ (Matta Dayanand) వెంగళరావ్ నగర్లోని పోలింగ్ బూత్ నంబర్ 79 వద్ద ఉన్నారు. పోల్ చిట్టీలు పంచుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు ఆయపై ఆర్వోకి ఫిర్యాదు చేశారు. స్థానికేతరుడైన దయానంద్ అధికార పార్టీ అభ్యర్థికి ఓటేయాలని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ బూత్ వద్ద సత్తుపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే భర్త మట్టా దయానంద్ హల్చల్
వెంగళ్రావు నగర్ పోలింగ్ బూత్–79 వద్ద హల్చల్ చేస్తూ, ఓటర్లను మభ్య పెడుతున్న మట్టా దయానంద్ https://t.co/rJAEvA8oDy pic.twitter.com/DLHbtYBzpz
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025