KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవెల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరి, బంజారాహిల్స్ నందినగర్‌లోని నివాసానికి వచ్చారు. ఇప్పటికే సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి వచ్చారు. రెండో ఫ్లోర్లో సిట్ విచారణ జరగనుంది.
కాగా కేసీఆర్ విచారణ నేపథ్యంలో నందినగర్‌లోని నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నాలుగంచెల భద్రతను అమలు చేస్తున్నారు. నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. కేసీఆర్ కుటుంబసభ్యులు హరీశ్‌రావు, కేటీఆర్, సంతోష్‌లకు మాత్రమే అనుమతినిచ్చారు.
రడ
కాగా, ఎర్రవెల్లి నివాసం నుంచి బయల్దేరిన కేసీఆర్ కాన్వాయ్‌కు దారిపొడవునా జనాలు నీరాజనం పలికారు. అభిమానులు, ప్రజలు రోడ్డు పక్కన నిలబడి అభివాదం చేస్తూ సంఘీభావం తెలిపారు. కాన్వాయ్‌పై పూలు జల్లి తమ అభిమానం చాటుకున్నారు.

Kcr2

Kcr3

Kcr4

Kcr5

Kcr6

Kcr7

Kcr8