KCR | హైదరాబాద్లో హైడ్రా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను ఎప్పటికప్పుడు తొలగించేశారు. కొన్నిచోట్ల ఫ్లెక్సీలు, బ్యానర్లను చించేశారు. కానీ వాటి పక్కనే ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పోస్టర్లను మాత్రం అలాగే వదిలేశారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ, ఇతర కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలను అస్సలు ముట్టుకోలేదు.
కేసీఆర్ ఫ్లెక్సీలపై హైడ్రా అధికారుల తీరుపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేసీఆర్ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఎక్కడ కనబడ్డా వెంటనే తీసేయాలని తెలంగాణ సీఎంవో నుంచి డైరెక్ట్ ఆదేశాలు వచ్చాయని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. సీఎంవో నుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి తీసేస్తున్నాం.. మమ్మల్ని ఏం చేయమంటారని వాపోతున్నారు.
కేసీఆర్ పోస్టర్స్, ఫ్లెక్సీలు ఎక్కడ కనపడ్డా వెంటనే తీసేయండి
డైరెక్ట్ ఆర్డర్స్ ఫ్రమ్ తెలంగాణ సీఎంవో
మమ్మల్నేం చేయమంటారు సార్ సీఎంవో ఆఫీస్ నుండి ఆర్డర్స్ వచ్చాయి అంటున్న GHMC, HMDA అధికారులు https://t.co/XKLpwsHp4o pic.twitter.com/to7NUWN9Av
— Telugu Scribe (@TeluguScribe) February 17, 2025
కేవలం కేసీఆర్ పుట్టిన రోజు కోసం ఏర్పాటు చేసిన పోస్టర్లు చింపేసి పక్కనే ఉన్న బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మరియు ఇతర కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలు మాత్రం అసలు ముట్టుకోలేదు
ఇదేం విచిత్రమో హైడ్రా @Comm_HYDRAA వారికే తెలియాలి https://t.co/5rTzTksW08 pic.twitter.com/astaiAcTKF
— Telugu Scribe (@TeluguScribe) February 17, 2025