ఎన్నికల ప్రచార పర్వంలో గులాబీదళం స్పీడ్ పెంచింది. పాదయాత్రలు, పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు, బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమాలతో హోరెత్తిస్తోంది. మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి నాయకులు, నగర ముఖ్య నేతలు, ఇన్చార్జీలు ఒక్కతాటిపైకి వచ్చిన గులాబీ సైన్యం క్షణం తీరిక లేకుండా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రతి ఓటరుకూ పథకాలు అవగతమయ్యేలా ప్రచారం చేస్తున్నారు. కంటి ముందు అభివృది ్ధ- ఇంటి ముందు అభ్యర్థి అంటూ ప్రజల ఆశీర్వాదం కోరుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలు 65 ఏండ్లు పాలించినా అభివృద్ధి జరగలేదని, గడిచిన పదేండ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వందేండ్ల అభివృద్ధికి బాటలు వేసిందంటూ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ప్రచార పర్వంలో గులాబీదళం స్పీడ్ పెంచింది. పాదయాత్రలు, పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు, బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నది. మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి నాయకులు, నగర ముఖ్య నేతలు, ఇన్చార్జీలు ఒక్కతాటిపైకి వచ్చిన గులాబీ సైన్యం క్షణం తీరిక లేకుండా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రతి ఓటర్‌కు పథకాలు అవగతమయ్యేలా ప్రచారం చేస్తున్నారు. కంటి ముందు అభివృద్ధి- ఇంటి ముందు అభ్యర్థి అంటూ ప్రజల ఆశీర్వాదం కోరుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఉమ్మడి పాలనలో హైదరాబాద్ ఎట్లుండే.. స్వరాష్ట్రంలో నగరాభివృద్ధిని కండ్లకు కట్టినట్లు వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు.
ఒక్కటంటే ఒక్కటి మతకల్లోలం కానీ, ఒక్కరోజూ కర్ఫ్యూ పెట్టిన సందర్భం కానీ, దొమ్మి, గొడవ లాంటి చెప్పుకోదగిన సంఘటనలు లేవని రొమ్ము విరుచుకొని సగర్వంగా చెప్పుకునే స్థితిలో బీఆర్ఎస్ పాలన జరిగిందని వివరిస్తున్నారు. పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా నగరం నిలిచిందని, నగరాన్ని విశ్వనగరంగా రూపుదిద్దేందుకు అడుగులు పడ్డాయని, ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రూపొందించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే ప్రచార అస్ర్తాలుగా సాగుతూ లబ్ధిదారులు, వారి కుటుంబాలతో పాటు ప్రజల నుంచి ఆశీర్వాదం పొందుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు 65 ఏండ్లు పాలించినా అభివృద్ధి జరగలేదని, గడిచిన పదేండ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వందేండ్ల అభివృద్ధికి బాటలు వేసిందంటూ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు.
ప్రతి ఓటరుకు అనుసంధానమయ్యే ప్రణాళికతో బీఆర్ఎస్ ప్రచార శైలి సాగుతున్నది. చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు చేసిన మోసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. ప్రత్యర్థి పార్టీల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు. కలిసి వచ్చే ఇతర పార్టీల నేతలకు గులాబీ కండువాలు కప్పుతూ నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ ప్రతిపక్ష పార్టీలకు ముచ్చేమటలు పట్టిస్తున్నారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు, కార్పొరేటర్లు ఆయా అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరినీ అప్యాయంగా పలుకరిస్తూ.. ఓటు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్న అభ్యర్థులకు వాడవాడలా, కాలనీల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.