MLC Shambipur Raju | తెలంగాణలో పోలీసులు ఉన్నది శాంతి భద్రతలు కాపాడడం కోసమా..? ప్రతిపక్షాలను వేధించడం కోసమా..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ బీఆర్ఎస్ టార్గెట్‌గా మాట్లాడుతున్నారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారినయన్నారు. మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు. వ్యవస్థలో వ్యక్తులకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ వారి తరపున ఉంటుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ వాళ్లు సోషల్ మీడియాలో కేటీఆర్‌పై ఎన్ని రంకులు అంటగట్టారు. బండి సంజయ్ కేటీఆర్ పై మాట్లాడిన మాటలు సామాన్య ప్రజలు కూడా మాట్లాడరు. అంతుచూస్తా అని బండి సంజయ్ అంటే కేసు ఎందుకు పెట్టలేదు. వరంగల్‌లో కేటిఆర్ మాట్లాడితే కేసులు పెట్టారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో ఎనిమిది సీట్లు గెలుచుకున్నారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆరోపించారు.
చెన్నూరులో మాజీ ఎమ్మెల్యే సుమన్ పై కేసు పెట్టి రిమాండ్ కు తరలించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది వినాలని అనుకుంటే ఖద్దరు చొక్కాలు వేసుకోండిడీజీపీ గతంలో సీపీగా పని చేశారు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను కాపాడాలి.రాష్ట్రంలో కాంగ్రెస్,బీజేపీ మిత్ర బృందంగా మారాయి. కాంగ్రెస్ ను సైకిల్ కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్‌గా మార్చారని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఎద్దేవా చేశారు.
తెలంగాణలో పోలీసులు ఉన్నది
శాంతి భద్రతలు కాపాడడం కోసమా?
ప్రతిపక్షాలను వేధించడం కోసమా?రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారినయ్!
మొన్న వరంగల్ ఎలాంటి తప్పుడు మాట్లాడని కేటీఆర్ గారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు..
మీ అంతుచూస్తా అని బీఆర్ఎస్ నాయకులను బహిరంగంగా బెదిరిస్తుంటే బండి… pic.twitter.com/2cZvdDUrEk— BRS Party (@BRSparty) May 13, 2026
Satyavathi Rathod | పబ్బులు, క్లబ్బుల్లో గొడవలప్పుడే బుద్ధి చెప్పాల్సి ఉండే : సత్యవతి రాథోడ్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అంకిత్
YCP MLC | వైసీసీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు