కడ్తాల్, సెప్టెంబర్ 22 : మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ కార్యకర్త వరికుప్పల మహేశ్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వివిధ రాజకీయ, యువజన సంఘాల నాయకులు మహేశ్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం వారు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబానికి డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, మాజీ జడ్పీటీసీ దశరథ్నాయక్, మాజీ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి రూ.5వేల చొప్పున రూ.20 వేలు ఆర్థిక సాయం అందజేశారు.
అలాగే, సాలార్పూర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన వెంకటయ్య కుటుంబానికి రాధాకృష్ణ ట్రస్ట్ తరుఫున రూ.5వేలు అందజేశారు. పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు భీక్యానాయక్, జగన్యాదవ్, వెంకటేశ్, మహేశ్, జంగయ్యయాదవ్, శ్రీనివాస్, మల్లేశ్ తదితరులు ఉన్నారు.