హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఓల్డ్ మలక్‌పేటలో దారుణం చోటుచేసుకున్నది. కుటుంబ తగాదాలతో అక్కను చంపాడో తమ్ముడు. పాత మలక్‌పేటకు చెందిన లక్ష్మిని ఆమె సోదరుడు మదన్ బాబు కత్తితో దాడిచేసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఆమెను చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.