హైదరాబాద్ : ఉన్నత విద్యాశాఖలో(Higher education department) బదిలీలు(Transfers) వెంటనే చేపట్టాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ ఈ బ్రిజేష్ అన్నారు. గురువారం బ్రిజేష్ ఆధ్వర్యంలోఉన్నత విద్య శాఖ కార్యదర్శి, కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్ర వెంకటేశంకు(Burra Venkatesham) సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్ది సంవత్సరాలుగా బదిలీలు చేపట్టలేదన్నారు. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరం కళాశాలలో ప్రారంభానికి ముందే బదిలీలపై నోటిఫికేషన్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలోడాక్టర్ సంగీ రమేష్, డాక్టర్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.