గోల్నాక, జనవరి 3: వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అంబర్పేట అన్నపూర్ణనగర్కు చెందిన మల్లేశ్ కుమారుడు రుత్విక్(8) శనివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా, అదే ప్రాంతంలో సంచరిస్తున్న వీధి కుక్కలు బాలుడిపై దాడి చేశాయి. బాలుడికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబసభ్యులు వెంటనే నల్లకుంట ఫీవర్ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు.