జగద్గిరిగుట్ట, జనవరి22 : ఆలయ సమీపంలోని నీటికొలనులో(Shivalayam temple lake) మునిగి బాలుడు మృతిచెందాడు. జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజులరామారం డివిజన్ మహదేవపురం శివాలయం కొలనులో మంగళవారం గుర్తుతెలియని బాలుడు(15) మునిగిపోయాడని స్థానికులు సమాచారం ఇచ్చారు. ఇంతో డీఆర్ఎఫ్ సిబ్బంది సాయంతో గాలించగా బుధవారం బాలుడి మృతదేహం లభ్యమైంది.
పరిసరాల్లోని సీసీ కెమెరాలు పరిశీలించగా ప్రమాదానికి ముందు ముగ్గురు బాలురు కాలనీ పరిసరాల్లో తిరిగినట్టు నమోదైంది. వీరిలో ఒకరు చనిపోయినట్టు(Boy dies) తేలింది. అతని దుస్తులు కొలను సమీపంలో లభ్యమయ్యాయి. దీంతో చనిపోయిన బాలుడి వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతుని సంబంధీకులు పోలీసులను సంప్రదించాలని కోరతున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.