బన్సీలాల్ పేట్, ఏప్రిల్ 1 : భోలక్ పూర్లోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారి కళ్యాణం, స్వామివారికి 51 కలశాలతో అభిషేకం, ఎల్లమ్మ బోనం సమర్పించారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులకు అన్నదానం చేశారు.
ఆలయ ఈవో జ్యోతి పర్యవేక్షణలో జరిగిన ఉత్సవాలలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు జి పవన్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ ఏసురి సావిత్రి, బి.ఆర్.ఎస్. డివిజన్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, ఏసూరి మహేష్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ జీ.శ్రీరాములు, సభ్యులు నాగలక్ష్మి, వెంకటబాబు, లక్ష్మీనారాయణ, లక్ష్మీ, అర్చకులు శివానంద శాస్ర్తి,రాజు పంతులు, పాల్గొన్నారు.