హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో(Shamshabad airport) బాంబు బెదిరింపు(Bomb threat )కలకలం సృష్టించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని ఇండిగో విమానానికి(Indigo flight) బాంబు బెదిరింపు వచ్చింది. కోయంబత్తూర్-చెన్నై వయా హైదరాబాద్ మీదుగా వెళ్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు. తనిఖీలు చేపట్టారు. ఆరు గంటలు చెక్ చేసిన తర్వాత ఏమీ లేదని నిర్ధారించి ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Ratan Tata | రతన్ టాటా లెజండరీ లైఫ్ ఇన్ ఫొటోస్
Ratan Tata | రతన్ టాటాకు ఆ కారు చాలా ప్రత్యేకం.. అదేంటంటే..?
Ratan Tata | నా గురించి ఆలోచించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. రతన్ టాటా చివరి పోస్ట్ ఇదే..