హైదరాబాద్ : సింగపూర్ – హైదరాబాద్ విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. సింగపూర్ విమానం సురక్షితంగా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేలా చర్యలు చేపట్టారు. విమానంలోని ప్రయాణికులను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు. విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాకపోవడంతో.. ప్రయాణికులతో పాటు ఎయిర్ పోర్ట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఇటీవల హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంర్నేషనల్ ఎయిర్ పోర్ట్కు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి.
ఆకతాయిలు విమానంలో బాంబులు అమర్చామని ఫోన్స్, మెయిల్స్ చేస్తుండటంతో ఎయిర్ పోర్ట్ సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఇటీవలే గల్ఫ్ ఎయిర్ లైన్స్ వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్టు సిబ్బంది విమానాశ్రయంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేదని అధికారులు తెలిపారు. వరుస సంఘటనలు అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.