హైదరాబాద్: ఓ బెదిరింపు కాల్ (Bomb Threat) శంషాబాద్ విమానాశ్రయంలో కలకలం సృష్టించింది. కోల్‌కతా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలోని బాత్రూంలో బాంబు పేల్చివేస్తామంటూ ఆగంతకులు ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన పైలట్ విషయాన్ని ఏటీసీకి తెలిపారు.
శంషాబాద్‌కు చేరుకున్న విమానాన్ని భద్రతా సిబ్బంది ఐసోలేషన్‌కు తరలించారు. నాలుగు గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత ఎలాంటి బాంబు లేదని తేల్చారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన ఎయిర్‌పోర్టు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్ ఎవరు చేశారనే విషయం తేల్చేపనిలో పడ్డారు.