సిటీబ్యూరో, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో శనివారం బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు పరేడ్‌గ్రౌండ్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా తివోలి క్రాస్ రోడ్స్ నుంచి ఫ్లాజా ఎక్స్ రోడ్స్‌ను మూసేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, చిలకలగూడ ఎక్స్ రోడ్స్, అలుగడ్డ బావి ఎక్స్ రోడ్స్, సంగీత్ ఎక్స్ రోడ్స్, వైఎంసీఏ ఎక్స్ రోడ్స్, ప్యాట్నీ ఎక్స్ రోడ్స్, ఎస్బీహెచ్ ఎక్స్ రోడ్స్, ప్లాజా, సీటీఓ జంక్షన్, బ్రూక్ బాండ్ జంక్షన్, తివోలి జంక్షన్, స్వీకార్ ఉపకార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, తిరుమల గిరి ఎక్స్ రోడ్స్, తాడ్ బన్ ఎక్స్‌రోడ్స్, సెంటర్ పాయింట్, డైమాండ్ పాయింట్, బోయిన్పల్లి ఎక్స్ రోడ్స్, రసూల్‌పురా, ప్యారడైజ్ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని, ఆయా చౌరస్తాల నుంచి రాకపోకలు సాగించకపోవడంతో పాటు ఎంజీ రోడ్డు, ఆర్పీ రోడ్డు, ఎస్డీ రోడ్లపై రాకపోకలు పూర్తిగా మానేయాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసుల సూచన మేరకు కేటాయించిన పార్కింగ్ స్థలాలలో తమ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..