సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట బీజేపీ కార్పొరేటర్లు, నేతలు సోమవారం ఆందోళన చేపట్టారు. గ్రేటర్లో 30 శాతం స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదని, బర్త్, అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు, నాలా అభివృద్ధి పనుల్లో అవినీతి తదితర సమస్యలను పేర్కొంటూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కలిసేందుకు బీజేపీ నేతలు యత్నించారు. పోలీసులు అడ్డుకుని 15 మందిని లోపలికి పంపిస్తామని చెప్పగా.
వినకుండా అందరిని అనుమతించాలని ధర్నా చేశారు. గేట్స్ క్లోజ్ చేయడంతో గేట్లు ఎక్కి ఆందోళన చేసి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం కొందరు బీజేపీ నేతలు కమిషనర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. స్ట్రీట్ లైట్ల సమస్య, ఇతర ప్రజా సమస్యలు 15 రోజుల్లోగా తీర్చాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని నేతలు చింతల రామచంద్రా రెడ్డి, గౌతంరావు, కార్పొరేటర్ శ్రవణ్ హెచ్చరించారు.