మల్కాజిగిరి, ఏప్రిల్ 16 : ప్రభుత్వ ఉద్యోగిపై బీజేపీ కార్పొరేటర్ దాడి చేశారు. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కథనం ప్రకారం… హార్టికల్చర్ విభాగంలో సూపర్వైజర్గా వెంకటేశ్‌కు ఓ మహిళ రోడ్డు పక్కన ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని రెండు నెలల కిందట ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్‌కుమార్ శివపూరిలోని తన కార్యాలయానికి సూపర్వైజర్ వెంకటేశ్‌ను పిలిపించారు.
చెట్ల కొమ్మలను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. అక్కడ 11 కేవీ కరెంట్ వైర్లు ఉన్నాయి..కాబట్టే ఇప్పటి వరకు తొలగించలేదని వెంకటేశ్ సమాధానం చెప్పారు. ఈ క్రమంలో వెంకటేశ్‌పై కార్పొరేటర్ శ్రావణ్ చేయి చేసుకొని, బెదిరించారు. జరిగిన విషయాన్ని సూపర్వైజర్ వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ పైన క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.