మియాపూర్, ఫిబ్రవరి 18 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో పేద ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతిపక్ష పార్టీలను విశేషంగా ఆకర్షిస్తున్నాయని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఇప్పటికే ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు క్యూ కడుతున్నారని, రాబోయే ఎన్నికల్లోగా ఆ పార్టీల కార్యాలయాలు ఖాళీ కావడం తథ్యమన్నారు. ఆల్విన్‌కాలనీ డివిజన్ పీజేఆర్నగర్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో విప్ గాంధీ సమక్షంలో శనివారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఆయా డివిజన్లలో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలకు చెందిన శ్రేణులు గులాబీ కండువాలు కప్పుకోవడంతో కాలనీ పార్టీ శాఖలు ఖాళీ అయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతర కృషి చేస్తున్నారని, ఇక్కడి పథకాలు ప్రజల కండ్లలో ఆనందాలను నింపుతున్నాయన్నారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి తగు గుర్తింపు ఉంటుందని, పటిష్టత కోసం పాటుపడే వారికి చక్కని భవిష్యత్ ఉంటుందని విప్ గాంధీ పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో రాజు, వేణు, భిక్షపతి, రమేశ్, పరుశరాం, రోహిణి, సునీత, మమత, లింగమ్మ, నరేందర్, శిరీష, శ్రీను, లాస్య తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వాసు, పోశెట్టి, అనీల్, మోజెస్, రాము పాల్గొన్నారు.
బాధితులకు అండగా ఉంటాం : విప్
కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన సయ్యద్ అన్వర్ నివాసం షార్ట్‌సర్క్యూట్‌తో కాలిపోయింది. విషయం తెలుసుకున్న విప్ గాంధీ శనివారం ఆయన నివాసాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటానని, ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు తగు కృషి చేస్తానని విప్ గాంధీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారావు, సంజీవరెడ్డి, నాగేశ్వర్రావు, అబుల్, ఖయ్యూమ్, కృష్ణ, రఫిక్, జ్యోతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.