అడ్డగుట్ట, డిసెంబర్ 6: పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను వరుసగా చోరీ చేస్తున్న వారిని చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.8 లక్షల విలువచేసే 7 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి వివరాలు వెల్లడించారు. ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన వంశీ తేజ(21) మెకానిక్‌గా పనిచేస్తుండేవాడు.
వంశీ కుటుంబీకులు గతంలో భోలక్‌పూర్‌లో ఉండేవారు. అయితే జల్సాలకు అలవాటు పడిన వంశీ సులువుగా డబ్బు సంపాదించేందుకు బైక్ దొంగతనాలను ఎంచుకున్నాడు. వంశీపై గతంలో గంజాయి సేవించినందుకు యాదగిరిగుట్టలో, సెల్‌ఫోన్ దొంగిలించినందుకు సుల్తాన్‌బజారు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై జైలుకు వెళ్లొచ్చాడు. అయితే జైలు నుంచి వచ్చిన అనంతరం ఇద్దరు మైనర్లతో కలిసి బైక్ దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. దీనిలో భాగంగా గాంధీ ఆసుపత్రి వద్ద రెండు, బోడుప్పల్లో 3, ఉప్పల్‌లో రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిలకలగూడ పోలీసులు వంశీతోపాటు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి 7 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన అడ్డాకుల విజయ్‌కుమార్(44), ఆలకుంట అక్షయ్(19) గాంధీ ఆసుపత్రిలో పార్కు చేసిన రెండు బైక్‌లను చోరీ చేసి తుకారాంగేట్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ సత్తార్‌కు విక్రయించారు. పోలీసులు వీరిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి వారి వద్ద నుంచి రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి, సీఐ అనుదీప్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.