Kidney Problems | కొండాపూర్, మార్చి 16 : ప్రపంచ మూత్రపిండ దినోత్సవం పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్, హార్లీ డేవిడ్సన్ బైకర్స్ సంయుక్తంగా మూత్రపిండ వ్యాధులపై అవగాహన పెంచేందుకు హైటెక్ సిటీలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూత్రపిండ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ, ప్రజల్లో కిడ్నీ సమస్యలపై చైతన్యం పెంచేందుకు బైక్ ర్యాలీ నిర్వహించడం అభినందనీయం అన్నారు. అనంతరం హాస్పిటల్ నెఫ్రాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ కమల్ కిరణ్ మాట్లాడుతూ.. మూత్రపిండాలకు సంబంధించి చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకపోవడంతో దీర్ఘకాలిక సమస్యగా మారి, మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే వరకు తెచ్చుకుంటున్నారన్నారు. సమస్యను ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్సలు చేసి నయం చేయగలుగుతామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, బైకర్స్ తదితరులు పాల్గొన్నారు.