కశ్మీర్ టు కన్యాకుమారి సైకిల్ యాత్ర
దేశమంతటా సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ రైడ్‌ను చేపట్టినట్లు హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ అధ్యక్షుడు రవీందర్ తెలిపారు. 2021లో తాము 13 మంది రైడర్లతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి యాత్రను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు
సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : దేశమంతటా సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ రైడ్‌ను చేపట్టినట్లు హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ అధ్యక్షుడు రవీందర్ తెలిపారు. 2021లో తాము 13 మంది రైడర్లతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి యాత్రను విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది నవంబర్ 30న కశ్మీర్‌లోని 213 ట్రాన్సిస్ట్ ఆర్మీ క్యాంప్ (శ్రీనగర్) నుంచి రైడ్ ప్రారంభమైనట్లు తెలిపారు.
12 మంది రైడర్లతో పాటు 5గురు సహాయక బృందం ఈ రైడ్‌ను విజయవంతంగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌కు చేరుకున్న ఈ సైకిల్ రైడ్ బృందానికి సుచిత్రలోని డెక్లథాన్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని సన్మానించి కన్యాకుమారికి సాగనంపారు. జాతీయ రహదారి 44 మీదుగా తమ రైడ్ 3800 కిలోమీటర్లు కొసాగుతుందని వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

