Crime News | సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): బొప్పాయి విత్తులు, ఇతర రసాయనాలతో నకిలీ మిరియాలు తయారు చేసి విక్రయిస్తున్న బేగంబజార్‌కు చెందిన వ్యాపారిని సౌత్‌ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదనపు డీసీపీ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం.. బేగంబజార్‌కు చెందిన వినోద్ కుమార్ గెహ్లట్ అలియాస్ వినోద్ గెహ్లట్ స్థానిక ఫిష్ మార్కెట్ సమీపంలో వినోద్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో కిరణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు.
ఇందులో కల్తీ ఆహారపు వస్తువులు విక్రయిస్తున్నారనే సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి బృందం.. దుకాణంపై దాడి చేసింది. 700 కిలోల కల్తీ మిరియాలు లభించాయి. వీటిని నగరంతో పాటు కర్ణాటక రాష్ర్టానికి కూడా సరఫరా చేస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నట్లు తేలింది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి విచారణకు షాహినాయత్‌గంజ్ పోలీసులకు అప్పగించారు.