సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): పురివిప్పి నాట్యమాడుతున్న నెమలి సోయగం ఓ వైపు.. నింగిని ముద్దాడుతున్నట్లుగా సీతాకోక చిలుకల సందడి.. చూపు తిప్పుకోనివ్వని పొద్దు తిరుగుడు పూల సౌందర్యం..చెంగుచెంగున దుంకుతున్న జింకల అందాలు మరో వైపు చూపరులకు కనివిందు చేస్తున్నాయి. ఈ అద్భుత చిత్రాలకు కూకట్పల్లి జేఎన్టీయూహెచ్ ఫ్లైఓవర్ పిల్లర్స్ వేదికగా నిలిచింది.
నగర సుందరీకరణలో భాగంగా జీహెఎచ్ఎంసీ పచ్చదనాన్ని పెంపొందించే సందేశంతో ఇలా ఫ్లై ఓవర్ల పిల్లర్లపై వేయించిన చిత్రాలు సందేశంతో పాటు నేత్రానందాన్ని కలిగిస్తున్నాయి.