బేగంపేట, జూలై 27 : బీసీలకు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసి తమ చిత్తశుద్ధ్దిని నిరూపించుకోవాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం వెస్ట్ మారెడ్‌పల్లిలోని తమ కార్యాలయంలో బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న బీసీ ధర్నాకు సంబంధించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండాప్రజలను మభ్యప్టెటేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. 42 శాతం రిజర్వేషన్‌కు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడుసైదులు యాదవ్, నాయకులు అశోక్ యాదవ్, రమేశ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.