 
                                                            ఖైరతాబాద్, అక్టోబర్ 30 : బీసీలకు రిజర్వేషన్లు రావాలంటే అది పోరాటాలతోనే సాధ్యమవుతుందని వక్తలు అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమితి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, విశ్రాంత జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడారు. సంప్రదాయ బీసీ సంఘాలు రాజకీయ పార్టీల కొమ్ముకాస్తున్నాయని, అసలు ధ్యేయం మరిచిపోయాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం అంద రూ ఏకతాటిపైకి వచ్చినట్లు బీసీ ఉద్యమాన్ని సైతం అదే తరహాలో ముందుకు తీసుకుపోవాలన్నారు.
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవులు మాట్లాడుతూ.. రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమ కార్యచరణ సిద్ధం చేశామని, నవంబర్ 3న మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి తహసీల్దార్లకు వినతి పత్రాలు, 4న కలెక్టర్లకు వినతి పత్రాలు, 6న ముఖ్య కార్యదర్శికి వినతి పత్రాల అందజేత, 7న రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం, 10న కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ విశారదన్ మహారాజ్, కేవీ గౌడ్, రాఘవేంద్ర ముదిరాజ్, డాక్టర్ విజయ్ భాస్కర్ పాల్గొన్నారు.
 
                            