సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెల పంపిణీ కొనసాగుతున్నది.
మూడు రోజులుగా నియోజకవర్గంలోని ఆయా పంపిణీ కేంద్రాలలో ప్రజా ప్రతినిధులు ఆడపడుచులకు చీరెలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం హైదరాబాద్ జిల్లాలో 15వేల చీరలను పంపిణీ చేయగా, జీహెచ్ఎంసీ వ్యాప్తంగా మూడు రోజులలో మొత్తం 3.50 లక్షల చీరెలను పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. 10 లక్షల చీరెల పంపిణీ కార్యక్రమం ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు చెప్పారు.